సమైక్యతను చాటే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంట కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణా జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జగిత్యాల IDOC లో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిని ఆకాంక్షించడం జరుగుతున్నదని అన్నారు. ప్రజలందరు సౌకర్యాలతో, సగౌరవంగా జీవించినపుడే ప్రజలందరి గొప్పతనం, భారత దేశం గొప్పతనం విదిత మవుతుందనీ అన్నారు. రాష్ట్రం సమైక్యత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించు కోవడం జరుగుతున్నదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక సంఘటనల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కోవడం జరిగిందని అన్నారు. తొలుత పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం విశ్వ కర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ విగ్రహానికి జ్యోతీ ప్రజ్వలన మంత్రి నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా పక్స్తవాల సందర్భంగా మంత్రి పోస్టర్ ఆవిష్కరించారు. స్వచ్ఛ సర్వెక్షన్ 2023 సందర్భంగా రాష్ట్ర స్థాయి లో ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులను మంత్రి సన్మానించారు. అనంతరం కాలుష్య నియంత్రణ బోర్డు సరఫరా చేసిన మట్టి వినాయకులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత , జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర , డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.