Monday, November 25, 2024

National స్పోర్ట్ డే పోస్ట‌ర్, టీ ష‌ర్ట్స్ అవిష్క‌ర‌ణ ….

హైద‌రాబాద్ – జాతీయ క్రీడా దినోత్సవం సంద‌ర్భంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు సంబందించి పోస్ట‌ర్ , టీ ష‌ర్ట్స్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ ,ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ నెల 29 న ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే లో భాగంగా పోస్టర్, లోగోఆవిష్కరించామ‌న్నారు. ధ్యాన్ చంద్ జ‌యంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత, తెలంగాణ లో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. 29 నాడు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేస్తారని తెలిపారు.

- Advertisement -

అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని., ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన తల్లిదండ్రుల స్పందన ముఖ్యం పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారని.. స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరుగుతుందని.. కరీంనగర్ లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉందని., స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాల‌ని పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement