Tuesday, November 26, 2024

TS: దేశ భ‌ద్ర‌త‌.. అభివృద్ధి మోదీతోనే సాధ్యం – కిష‌న్ రెడ్డి

కాగజ్ న‌గ‌ర్ – దేశంలోని ప్రజలందరూ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశం అభివృద్ధి చెందాలని భద్రత ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. అది నరేంద్ర మోడీ వల్లే సాధ్యమవుతుందని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కాగజ్ నగర్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఆదివాసీ ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి జన్ మన్ యోజన పథకానికి మోడీ శ్రీకారం చుట్టారని తెలిపారు.


ఆదివాసి ప్రాంతంలో అభివృద్ధి చేయకపోతే మరో 75 సంవత్సరాలైనా వారు అభివృద్ధిలోకి రారని తెలిపారు. రానున్న 5 ఏళ్ళ పాటు మహిళ సంక్షేమం కోసం వారి హక్కుల కోసం సాధికారత కోసం కూడా కేంద్రం పని చేస్తుందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేశామని, మహిళ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చామన్నారు. గ్రామాల్లోని మహిళల సమగ్ర అభివృద్దికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. టాయిలెట్స్ నుండి మెుదలుకొని బ్యాంక్ అకౌంట్స్ వరకు మహిళలకు అందించామన్నారు. సైన్యంలో కూడా మహిళ ప్రవేశాన్ని ప్రోత్సాహమిస్తున్నామన్నారు. మహిళ శక్తిపై పూర్తి స్థాయిలో తోడ్పాటును ఇస్తామన్నారు. రైతుల అభివృద్దిపై కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. యువతను కూడా అనేక రకాలుగా పొత్సాహిస్తుందన్నారు. స్టాండ్‌ప్, స్టాటప్ ద్వారా యువతను కేంద్రం ప్రోత్సాహమిస్తుందన్నారు.

రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారని గుర్తు చేశారు.. పెరిగిన ధరలను కేంద్రమే సబ్సిడీగా భరిస్తుందన్నారు. ఎరువుల మీద అత్యధిక సబ్సిడీ అందిస్తుంది కేంద్రం ఒక్క రైతుకు ఎకరాకు రూ.20 వేలు సబ్సిడీని కేంద్రం అందిస్తుందన్నారు. తెలంగాణ రైతులకు 35 వేల కోట్లు సబ్సీడిని కేంద్రం చెల్లించిందని గుర్తు చేశారు. నానో యూరియాను ప్రోత్సాహిస్తామన్నారు. దీని మెరుగైన పలితాలు ఉంటాయన్నారు. ప్రతి గ్రామానికి డ్రోన్ అందిస్తామన్నారు. తెలంగాణలో సగంలో ఆగిన ప్రాజెక్ట్ లకు రూ. 2500 కోట్లు ఇచ్చి పూర్తి చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. రైతుల ఉత్పత్తులు రవాణా చేయాడానికి రైళ్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. సిర్పూర్ కాగజ్ నగర్, అదిలాబాద్, నిజామాబాద్ రైతులకు లబ్ది చేకురేలా ఇనాం మార్కెట్ ద్వారా నేషనల్ ఆగ్రికల్చర్ పోర్టల్ కు అనుసంధానం చేశామని తెలిపారు. ఈ నేషనల్ ఆగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ ద్వారా తెలంగాణలో 40లక్షల మంది లబ్ది చేకూరిందన్నారు. తెలంగాణలో రూ.3 లక్షల 50వేల కోట్ల రుణాలు కేంద్రం రైతులకు ఇచ్చింది.. మెుత్తంగా 38 వేల రైతులు లబ్ది పొందుతున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎంపి సోయం బాబురావు , సిర్పూర్ శాసన సభ్యుడు డా.పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్ శాసన సభ్యుడు పాయల్ శంకర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement