హైదరాబాద్, ప్రభన్యూస్: జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నుంచి నాలుగురోజులపాటు నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కౌస్తవ్ దత్తా వెల్లడించారు. 28ఏళ్ల అనంతరం రెండోసారి జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 22 రాష్ట్రాలకు చెందిన పవర్ లిఫ్టర్లు 60జట్లుగా ఛాంపియన్‌షిప్‌లో పోటీపడను న్నా రని తెలిపారు.
జూనియర్, సబ్ జూనియర్స్, మాస్టర్స్ బాయ్స్, గర్ల్స్ విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నామని స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తెలంగాణ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రంగీశ్వరి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఈ ఛాంపియన్‌షిప్ పోటీలను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కమిటీ వైస్ చైర్మన్ టి రాజశేఖ ర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ జగ్గా చంద్రశేఖర్, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily