Friday, November 22, 2024

National Herald – ముగిసిన అంజ‌న్న ఈడీ విచార‌ణ‌

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ప్రశ్నించారు. దాదాపు రెండు గంటల పాటు అంజన్ కుమార్ యాదవ్‌ను విచారించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని యంగ్ ఇండియన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అయితే యంగ్ ఇండియన్ ఫౌండేషన్ ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి ఈడీ అధికారులు మరోసారి ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. విచార‌ణ అనంత‌రం అంజ‌న్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, తాను యంగ్ ఇండియాకు రూ.20 ల‌క్ష‌లు ఇచ్చాన‌ని, అందుకు ఆ సంస్థ త‌న‌కు ర‌శీదు కూడా ఇచ్చింద‌ని తెలిపారు..ఆ డ‌బ్బు ఎక్క‌డిద‌ని ఈడీ ప్ర‌శ్నించార‌ని , తాను వివ‌రాలు తెలిపాన‌ని చెప్పారు.. తాను ఎంపిగా ప‌నిచేసినందున నెల నెల పించ‌ను అందుతున్న‌ద‌ని కూడా చెప్పాన‌న్నారు.. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement