Tuesday, November 26, 2024

చెరువుల పునరుద్ధరణపై ఎన్జీటీ కీలక తీర్పు

తెలంగాణలో చెరువుల పునరుద్ధరణపై ఎన్జీటీ కీలక తీర్పును వెలువరించింది. శేరిలింగంపల్లి లింగంకుంటలో ఎస్టీపీ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌జీటీలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ఎన్టీజీ.. చెరువుల పరిధిలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణాల తొలగింపునకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. త్వరలో చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు ఖరారు చేయాలని తెలిపింది. బఫర్‌ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఎన్జీటీ సూచించింది. చెరువుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement