తెలంగాణలో జాతీయ భద్రతా కళాశాల (నేషనల్ డిఫెన్స్ కాలేజ్- ఢిల్లీ) ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. క్షేత్ర పర్యటనలో భాగంగా 15 మందితో కూడిన కేంద్ర బృందం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేస్తోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను నేషనల్ డిఫెన్స్ కాలేజ్ బృందం సందర్శించింది. తెలంగాణకు హరితహారం ద్వారా అమలు చేస్తున్న జంగల్ బచావో జంగల్ బడావో కార్యక్రమాలను జాతీయ బృందానికి పీసీసీఎఫ్ ఆర్. ఎమ్. డోబ్రియల్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరిత కార్యక్రమాలు, అటవీ పునరుద్ధరణనపై కేంద్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని జాతీయ భద్రతా కళాశాల బృందం అభినందించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement