Thursday, November 21, 2024

Medigadda barrage: తెలంగాణకు జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ లేఖ.. మేడిగ‌డ్డ‌ను ప‌రిశీలిస్తాం

కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథార్టీ తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత.. వైఫల్యానికి గల కారణాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని లేఖలో పేర్కొంది.

జాతీయ అథార్టీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి.. వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement