నిజామాబాద్ అర్బన్, (ప్రభన్యూస్) : దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులలో అభ్యసన సామార్ధ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 12 న (నెషనల్ అచీవ్ మెంట్ సర్వే ) నిజామాబాద్ జిల్లాలో కుడా జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి, న్యాస్ నోడల్ ఆఫిసర్ దుర్గా ప్రసాద్, న్యాక జిల్లా ప్రతినిధి నీరజ్ అవస్తీలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరి పాఠశాలకు నేషనల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహణ భాధ్యతలను అప్పచేప్పడం పాఠశాల చైర్మెన్ డాక్టర్ యం మారయ్య గౌడ్, న్యాస్ జిల్లా కో అర్డినేటర్ బాస్కర్ లతో కలిసి జిల్లా అధికారులు విలేఖరుల సమావేశం లో వారు మాట్లాడారు…
జిల్లాలో 189 ఎంపిక చేసిన పాఠశాల విద్యార్థుల పై ఈ సర్వే జరుగుతుందని తెలి పారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఎస్ఆర్ డిస్కవరి స్కూల్ తోలిసారి న్యాస్ నిర్వహణ భాధ్యతలను దక్కించుకున్న తోలి సిబిఎస్ఇ పాఠశాల అన్నారు. ఈ నెల 11న ఎస్ఎస్ఆర్ పాఠశాలలో ఎంపిక చేయ్యబడిన పరిశీలకులు, క్షేత్రస్థాయి పర్యవేక్షకులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడేడ్ పాఠశాలలో చదివే విద్యార్ధులకు మూడు నాలుగు తరగతులకు మాత్రుభాషా, గణితం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లపై, 8,10 తరగతులకు మాత్రుబాష, గణితం, సోషల్, సైన్స్, ఆంగ్ల సబ్జేక్టులలో పరిక్షలను నిర్వహిస్తారు అని పెర్కోన్నారు.
జిల్లాలో 189 పాఠశాలకు సంబంధించిన గ్రేడ్ 3 తరగతుల విద్యార్థులు 51, గ్రేడ్ 5 తరగతుల 47, గ్రేడ్ 8 నుంచి 61, గ్రేడ్ 10 కి సంబధించిన 69 మంది విద్యార్థుల అభ్యసన సామార్ధ్యాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో 3,4 తరగతులకు గంటన్నర, మిగిలిన తరగతులకు రెండుగంటలలో పరిక్షలకు సమయం ఇస్తారని తెలిపారు. పరీక్షల సందర్భగా ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయుల కు ప్రశ్నలను ఇచ్చి సమాదాదానాలు రాబడుతారు. విద్యార్థులకు మౌకికంగా ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతారు. సర్వే ఆదారంగా జిల్లాల వారిగా కేంద్రం సమగ్ర నివేధికలను రూపోందిస్తుంది. ఎజిల్లాలో విద్యార్థలు అభ్యసన సామార్థ్యాలను గుర్తించి వాటి ప్రకారం రికార్డులు తయారు చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాల విధ్యాశాఖ చర్యలు తీసుకునే విధంగా న్యాస్ సర్వే జరగుతుందని వారు తెలిపారు.