నర్సింహులపేట, (ప్రభన్యూస్).. కలెక్టర్ సార్.. మా బజారుకు రోడ్డు పోయించండి అంటూ ఓ ఇద్దరు బాలికలు సభా వేదిక నుండి కలెక్టర్ దిగి వస్తుండగా వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర వేడుకల మందిరంలో సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా కలెక్టర్ శశాంక విశిష్ట అతిథిగా హాజరయ్యారు..ఈ సమావేశం అనంతరం కలెక్టర్ వేదిక దిగివస్తుండగా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన వేటకారి వెంకట్ రాములు కూతుర్లు నందిని,పూజిత ఏకంగా అందరినీ వదిలి బెదరకుండా కలెక్టర్ దగ్గరకు వచ్చి ..మా ఇల్లు హైస్కూలు వెనుకాల ఉందని.. మా బజారుకు రోడ్డు లేదని.. దయ చేసి రోడ్డు వేయించండని కలెక్టర్ శశాంకను వేడుకున్నారు.వారిని చూసిన కలెక్టర్ చిరునవ్వుతో ఒకే చేస్తాం అని చెప్పారు.దైర్యంగా అడిగిన ఆ బాలికలను అక్కడ ఉన్న వారు మెచ్చుకున్నారు.