Friday, November 22, 2024

Narsampet – ఎటిఎంలలోని న‌గ‌దు చోరీకి యత్నం…నిందితుల అరెస్ట్ …

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో గత రాత్రి జరిగిన ఏటీఎం ల పై రాళ్ల దాడి ఘటన ఉదయం వెలుగులోకి రాగా అప్రమత్తమైన పోలిస్ యంత్రాంగం అప్రమత్తమై చర్యకు పాల్పడిన నిందితుడిని పట్టుకున్నారు.అందుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్,ఏసిపి తిరుమల్ తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ కేంద్రానికి మేడిద వంశీ జల్సాలకు అలవాటు పడి గత రాత్రి ఏటీఎం లలో చోరికి ప్రయత్నం చేయగా విఫలం చెంది ఏటీఎం లపై రాళ్ల దాడి చేసినట్లు తెలిపారు. ఘటన జరిగిన గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నార‌ని చెప్పారు. నిందితుడిని పట్టుకోడంలో ప్రతిభ కనబరిచిన సీఐ రవి కుమార్,ఎస్సై రవి,కానిస్టేబుళ్లు అక్బర్ పాషా,రమేష్,శ్రీధర్ లను ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ రివార్డ్ అందజేసి అభినందించారు.

ఏటీఎం ల ధ్వంసం..
నర్సంపేట పట్టణ కేంద్రంలోని ద్వారక పేట రోడ్డులో ఉన్న ఎస్ బి ఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం , వరంగల్ రోడ్డులో ఉన్న హెచ్డిఎఫ్సి కి చెందిన ఏటీఎం లపై దుండగులు రాళ్ల దాడికి యత్నించారు. ఈ దాడిలో ఏటీఎం ల డిస్ప్లే లు ధ్వంసం అయ్యాయి.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దాడికి యత్నించిన వారి వివరాలు తెలుసుకునే వారిని అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement