Thursday, November 21, 2024

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను ఆగం చేస్తున్నాయ‌న్న న‌రేంద‌ర్

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆగం చేస్తున్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం వస్తదని కేసీఆర్, సంవత్సరానికి 1లక్ష ఉద్యోగాలు కలిపిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చదువుతే ఉద్యోగాలు లేవని, పంట పండిస్తే కొనేటోళ్లు లేరని అన్నారు. నిన్న మొన్నటి వరకు ప్రతి గింజ కొంటామని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యే లు ప్రగల్బాలు పలికి ఇప్పుడు కేంద్రం కొనటం లేదనటం సిగ్గుచేటన్నారు .రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధర్నా చౌక్ వద్దని, ధర్నాలే చేయవద్దని, ఎప్పుడూ పోలీస్ ఆక్ట్ అమలు చేయించే మీకు ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు.

ఈ దొంగ ధర్నాలు చేయడం ప్రభుత్వం మీద వున్న వ్యతిరేకతను ప్రజల దృష్టి మరల్చటానికే అన్నారు. ఈ ఏడు సంవత్సరాలలో ఉద్యోగాలు వేయక, నిరుద్యోగులు వ్యవసాయం చేస్తుంటే పండించే పంట కొనేవారు లేక రైతులు హత్మ హత్యలు చేసుకునే పరిస్థితుల్లో వున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు అపి వెంటనే రైతులను ఆదుకుంటూ వెంటనే పంటను కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనని రైతులను నాశ‌నం చేయటానికే ఉన్నాయన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ రుణమాఫీ చేయలేదని, మీకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేసారు. అంతే కాకుండా రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదో ధర్నాలో పాల్గొన్న మంత్రులు, ఎమ్యెల్యేలు ప్రజలకు చెప్పాలన్నారు. దొంగ ధర్నాలు అపి రైతులకు న్యాయం చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే వడ్లు కొనేలా చ‌ర్య‌లు తీసుకుంటూ రైతులకు వ్యతిరేకంగా వున్న రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. రైతులకు అన్యాయం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెరాస, బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రైతులకు కాంగ్రెస్ పార్టీతోనే లాభమని కాంగ్రెస్ తోనే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిరంజన్ రెడ్డి, పీషర్ మేన్ మండల అధ్యక్షులు లచ్చొల రవీందర్, తోగుట గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాసర్ల నర్సింలు, విష్ణు, మధు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement