Sunday, November 24, 2024

Nandikonda – పాల‌న‌ను గాలికి వ‌దిలేసిన కాంగ్రెస్ – జ‌గ‌దీష్ రెడ్డి ..

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ (నందికొండ)లో వానరాలు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వం సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ధ్వ‌జ‌మెత్తారు. , కోతులు చనిపోయిన వాటర్ టాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నాగార్జునసాగర్ ను మున్సిపాలిటీగా చేసి, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని, 2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. ఇప్పటికి గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సాగునీటికి నీళ్లు అందించమంటే కూడా ప్రభుత్వానికి చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో తాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement