హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పేరును ఉన్నత విద్యా మండలి మార్చింది. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. మే 6న టీఎస్ ఈసెట్, జూన్ 4 , 5 న ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు టీఎస్ పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ తేదీలకు ఆమోద ముద్ర వేయడంతో నేడు అధికారికంగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులందరూ ఈ మేరకు అర్హత పరీక్షలకు రాసేందుకు సిద్ధమవ్వాలని కోరింది.