Tuesday, November 26, 2024

MLC Election Results: టీఆర్ఎస్ గెలుపు ముందే చెప్పా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామ నాగేశ్వరరావు అన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ విధానాలతో ఎమ్మెల్సీ ఎన్నికలలో కారుదే జోరు చూపించిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని ముందే చెప్పానని అన్నారు. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల  సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రజలంతా పూర్తిస్థాయిలో విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని తెలిపారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, ఖమ్మం మేయర్, సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, వైరా, మునిసిపాలిటీలతో పాటుగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ గెలుచుకున్నదని నామా చెప్పారు. సమైక్య రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్యలతో పాటు విద్యుత్ సంక్షోభం ఉండేదని… కానీ స్వరాష్ట్రం సిద్ధించాక దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వారే ఉండి గెలిచారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఎంపీ నామ నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement