Tuesday, November 26, 2024

కాంగ్రెస్ కి ఓటేస్తే క‌న్నీళ్లే…..రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి

సాగర్‌ను ఏనాడు పట్టించుకోని జానారెడ్డి
దేశాన్ని కార్పోరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నమోడీ

నల్గొండ, : సాగర్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లేస్తే కన్నీళ్లే మిగులుతాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నా రు. కాంగ్రెస్‌ను తిరస్కరించడం వల్లనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడమనూరు మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సంద ర్భంగా జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ 2014లో ప్రజలు కేసీఆర్‌కి వేసిన ఓటే తెలంగాణ ను సుభిక్షంగా, సస్యశ్యామల ముగా మార్చిందని, చేతకాని కాంగ్రెస్‌ నాయకుల వల్ల నే తెలంగాణ బీడుగా మారిందని, సమైక్య పాలకులు సాగర్‌ నీళ్లు కృష్టా డెల్టాకు దోచు కొని పోతుంటే నోరు మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్‌ నాయకులు కాదా అని ప్ర శ్నించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి సాగర్‌ గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి కాకపోవడానికి కారణం జానారెడ్డియేనని ఎద్దేవా చేశారు. ఇంకా ఈ కాంగ్రెస్‌ నాయకులు అవసరమా ఆలోచన చేయాలన్నారు. పదవుల కోసమే వారి ఆరాటం తప్పా ప్రజలపై ఏనాడు బాధ్యత చూపించలేదన్నారు. ప్రధాని మోడీ దేశా న్ని కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు- పెట్టి దేశాన్ని దోచుకునే దొంగలకు వత్తాసు పలుకు తున్నాడని ఆరోపించా రు. గ్యాస్‌,పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి మోడీ ప్రజల జేబుల కు చిల్లులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు ఓటేస్తే మాత్రమే సం క్షేమం, సుపరి పాలన వచ్చింది..కేసీఆర్‌ ఓటేస్తే రైతును రాజును చేసిన విషయాన్ని మరచిపోవద్దన్నారు. జానారెడ్డి వయస్సు అయిపోయిందని ఆయన తో ఎలాంటి లాభం లేదని గుర్తించాల న్నారు. అధికారంలో ఉన్నది టీఆర్‌ ఎస్‌.. అభివృద్ధికి కట్టు-బడి ఉన్నది తెరాస అని సీఎం నిజం చేశారని మంత్రి జగదీష్‌ రెడ్డి చెప్పారు.
భగత్‌ గెలుపుతో సాగర్‌కు మంచి రోజులు వస్తాయని, ప్రజలంతా ఆలోచన చేసి విలక్షణ తీర్పు ఇవ్వాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ మాట్లాడుతూ త‌న‌ గెలుపు కోసం పని చేస్తున్న ప్రతీ ఒక్కరికి ఋణపడి ఉంటానని, మంత్రి జగదీష్‌ రెడ్డి సహకారంతో నాన్న నర్సింహయ్య నియోజకవర్గంలోని సమస్యలకు పరి ష్కారం చూపించారని చెప్పారు. మీ బిడ్డగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చానని, మీ కుటు-ంబ సభ్యుడిలా ఆదరించాలని కోరారు. మంత్రితో పాటు- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌ రావు, బొల్లం మల్లయ్యయాదవ్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement