చౌటుప్పల్, (ప్రభ న్యూస్) : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఇవ్వాల్టికి (శుక్రారం) 16వ రోజుకు చేరింది. చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయం ముందు ఇవ్వాల మోకాళ్లపై కూర్చొని కార్మికులు నిరసన తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు.
రెండు దశాబ్దాలుగా గ్రామాలలో పనిచేస్తున్న కార్మికులు కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేశారన్నారు. పంచాయతీ కార్మికులందరికి కనీస వేతనం రూ. 16 వేలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు 10 లక్షల బీమా చెల్లించాలని కోరారు.