యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో 57 ఏళ్ల వారికి కొత్తగా మంజూరు చేసిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 50 వేల మందికి ఆసరా పెన్షన్ లు ఇస్తున్నాం, భారత దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి జగదీష్ అన్నారు. మానవీయ కోణంలో ప్రభుత్వం నడుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక విప్లవం సృష్టిస్తున్నారు అన్నారు. భగీరథ పథకం వల్ల ఫ్లోరైడ్ అంతమైందన్నారు. మునుగోడు ప్రాంతం నో మ్యాన్ జోన్ గా మారే ప్రమాదం పొంచి ఉంది అని WHO చెప్పిన కూడా ఆనాటి సమైక్య పాలకులు గుక్కెడు నీళ్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే భగీరథ ద్వారా ఫ్లోరైడ్ కి శాశ్వత పరిష్కారం చూపించారన్నారు. కేంద్రమే చెప్పింది.. ఒక్క ఫ్లోరైడ్ కేస్ నమోదు కాలేదు అని.. సాగర్ ఆయకట్టు కింద వరుసగా 15 సార్లు సాగు నీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. మునుగోడు నియోజకవర్గం కూడా కేసీఆర్ కు అండగా ఉంటుంది… మునుగోడులో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement