మోత్కూర్, (ప్రభ న్యూస్) : మున్సిపల్ కేంద్రంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద మెయిన్ రోడ్డు పై ఏర్పడిన మోకాళ్ళ లోతు గుంతల్లో మంగళవారం రేట్ కట్టెలోడు తో పోతాయిగడ్డ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం భారీ గుంతలో దిగబడడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డు వెడల్పు కాక ముందే రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయగా ,పాత కూరగాయల మార్కెట్ వద్ద తీవ్ర రద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు చిన్నపాటి గుంతలు కాస్త.. భారీ గుంతలుగా మారడంతో ఇటీవల మున్సిపల్ అధికారులు గుంతల్లో పోసిన ఎర్రమట్టితో డీసీఎం టైరు ఆ గుంతలో దిగబడడడంతో ఒక వైపు డి సి ఎం ఒరగగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు .దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడంతో జెసిబి సహాయంతో డీసీఎం వాహనాన్ని ముందుకు జరపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగాయి.
మున్సిపల్ కేంద్రంలో మెయిన్ రోడ్ లో ఎక్కడా చూసిన మోకాళ్ళలోతు గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని, గుంతల్లో మట్టి కాకుండా సన్న కంకర లాంటిది పోసి వాహనాలు దిగబడకుండా చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.