యాదాద్రి : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మాణిక్యాలను వెలుగులోనికి తీసుకురావాలని, క్రీడలతో పాటు క్రీడాకారులను అందరూ ప్రోత్సహించాలని టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండల కేంద్రంలో జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేలా కృషి చేయాలన్నారు. క్రీడలతో యువకుల్లో ఆరోగ్యం దృఢంగా మారుతుందని, కరోనా లాంటి మహమ్మారి రోగాలను కూడా ఎదుర్కోవాలంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఉండాలన్నారు. ఆ శక్తి క్రీడలతో వస్తుందన్నారు. క్రీడలను మండల, జిల్లా స్థాయిలో ప్రోత్సహించి ఆదరణ కల్పించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానన్నారు ప్రాథమిక పాఠశాల నుంచి క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి నరేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆర్ఎస్ఎస్ చైర్మన్ నర్సింలు, మాజీ ఎంపిపి రవీంద్రనాథ్ గౌడ్, వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కర్ణాకర్, టవర్నమెంట్ నిర్వాహకుడు మాజీ ఎంపిటిసి తలారి శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement