Friday, November 22, 2024

ఇప్పటి వరకు కోటిన్నరకు చేరువలో మునుగోడులో పట్టుబడిన డబ్బు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ధనం ఏరులై పారుతోంది. హైదరాబాద్‌లో బుధవారం ఒక్కనాడే సుమారు 15 కోట్ల మేరకు డబ్బు పట్టుబడింది. అయితే ఈ మొత్తం ఎంత అన్న దానిపై పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక రాజధానిఇ హైదరాబాద్‌ సంగతి ఇలా ఉంటే ఇక మునుగోడులో పరిస్థితి వేరుగా ఉంది. మునుగోడులో ఇప్పటి వరకు రూ. 1,48,44,160 కోట్లు పట్టుకున్నట్లు మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌ సింగ్‌ తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మునుగోడు నియోజక వర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారని, తమ ఓటు గల్లంతైందంటూ చాలా మంది ప్రతి రోజూ వస్తున్నారని, వారి సమస్యపై అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారు. ఈవిఎం మిషన్లు అన్నీ కండిషన్‌లోనే ఉన్నాయని అంటున్నారు. మాక్‌పోల్‌లో ఈవిఎంలు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement