Tuesday, November 19, 2024

సాగ‌ర్ లో ప్ర‌శాంతంగా కొనసాగుతున్న పోలింగ్ – ఓటు హ‌క్కు వినియోగించుకున్న భ‌గ‌త్

హాలియా: నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. టీఆర్ఎస్ ‌పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుటుంబ స‌మేతంగా ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్ర‌హీంపేట‌లో ఓటు వేశారు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. క‌రోనా ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) పోలింగ్ స‌మ‌యాన్ని రెండు గంట‌ల‌పాటు పొడిగించింది. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 41 మంది బ‌రిలో నిలిచారు. క‌రోనా బాధితుల‌కు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటుచేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భ‌గ‌త్ , కాంగ్రెస్ నుంచి జానారెడ్డి , బిజెపి నుంచి ర‌వికుమార్ రంగంలో ఉన్నారు వ‌చ్చే నెల 2న ఉప ఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement