పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందని, సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 335 మంది లబ్ధిదారులకు కోటి 45లక్షల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని అప్పుడు ఆపదలో ఉన్న వారికి అందరికి అందేది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement