మంత్రి జగదీష్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మునుగోడు ప్రాంతంలో ప్రత్యేక పికెట్ ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో మునుగోడు వైపు వెళుతున్న మంత్రి జగదీష్ రెడ్డి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని.. అందుకు తాను సహకరిస్తానని మంత్రి తనిఖీ బృందంతో చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement