Friday, November 22, 2024

రెండో ప్రాధాన్య‌త‌లో 67 మంది ఔట్… ప‌ల్లాదే పై చేయి..

హైదరాబాద్‌, : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్య ఓట్లలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోయింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి తొలి ప్రాధాన్య ఓటింగ్‌ ఏడు రౌండ్లలోనూ.. తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించారు. అలాగే తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కిం పు పూర్తయిన తర్వాత సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి కంటే 27,500 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మూడో స్థానంలో కోదండరాం కొనసాగారు. తొలి రౌండ్‌లో 50శాతం ఓట్లు రాకపోవడంతో.. ద్వితీయ ప్రాధాన్య ఓటు లెక్కించారు. తొలి ప్రాధాన్యం ఓట్లను మొత్తం ఏడు రౌండ్లలో లెక్కించగా, మొత్తం ఓట్లు 3,87,969కు గాను 21,636 ఓట్లు చెల్లకుండా పోయాయి. 3,66,333 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 1,10,840 ఓట్లు, మల్లన్న 83,290 ఓట్లు, కోదండరాం 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 39,107 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ 27,588, సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డి 9577 ఓట్లు సాధించారు. గెలుపు కోసం పల్లా రాజేశ్వరరెడ్డికి 72,327, తీన్మార్‌ మల్లన్నకు 99,877 ఓట్లు, కోదండరామ్‌కు 1,13,095 ఓట్లు కావాల్సిన దశలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది…ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 71 మందిలో 67 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ పూర్తయ్యింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 6546 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో కొనసాగుతున్న తీన్మార్‌ మల్లన్నకు 8565, ప్రొఫెసర్‌ కోందడరామ్‌కు 9038 ఓట్ల చొప్పున వచ్చాయి. ఎలిమినేషన్‌ ఓట్లతో సమీప ప్రత్యర్థి మల్లన్నపై పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు 1,17,386 ఓట్లు వచ్చాయి. ఇక ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 79,110 ఓట్లు, బీజేపీకి 42,015, కాంగ్రెస్‌కు 30,358 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు కావాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు 67 వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్,ఓట్ల బదలాయింపు అనంతరం ఓట్ల వారీగా…
పల్లా – 1180
తీన్మార్ మల్లన్న -1750
కోదండరాం- 2362

ప్రాధాన్య‌త ఓట్లు మొత్తం సాధించిన వారి వివ‌రాలు
పల్లా రాజేశ్వర్ రెడ్డి – 7,726
మల్లన్న – 10,318
కోదండరామ్- 12,400

తొలి ప్రాధాన్యం +రెండో ప్రాధాన్యంతో కలిపితే..
పల్లా – 1,10,840+7,726 =1,18,566
మల్లన్న – 83,290+10,318 = 93,608
కోదండరాం – 70,072+ 12,400 = 82,472
ఇప్ప‌టి వ‌ర‌కు 24,958 ఓట్లతో పల్లా ఆధీక్యం….

Advertisement

తాజా వార్తలు

Advertisement