Friday, November 22, 2024

నోముల వార‌సుడికే సాగ‌ర్ సీటు… భ‌గ‌త్ కు బి ఫామ్ ఇచ్చిన కెసిఆర్…

నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీఆర్‌​ఎస్‌ పార్టీ దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్‌కు టికెట్‌ ఇచ్చింది. తెలంగాణభవన్‌లోనేటి మ‌ధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల కుమారుడికిభగత్‌కు బీఫామ్‌ అందజేశారు. అలాగే పార్టీ ప్రచారం కోసం 28లక్షల చెక్‌ను కూడా అందించారు. రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్‌ వేయనున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని భావించిన కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దీంతో ఆయ‌న భ‌గ‌త్ కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాగా, తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న భ‌గ‌త్ వ‌య‌స్సు 37 ఏళ్లు.. ఉన్న‌త విద్యావంతుడు.. ఇంజ‌నీరింగ్ తో పాటు ఎంబిఎ కూడా చేశారు.. అలాగే లా ప‌ట్ట భ‌ద్రుడు కూడా.. ప్ర‌స్తుతం ఆయ‌న హైకోర్టు లో న్యాయ‌వాదిగా ప‌ని చేస్తున్నారు.. భార్య భ‌వానీ, కుమారుడు రానాజై, కుమార్తె రేయాశ్రీతో క‌ల‌సి త‌ల్లితో పాటు హ‌లీయాలో నివాస‌ముంటున్నారు.. 2014 నుంచి టిఆర్ ఎస్ లో క్రీయాశీల‌కార్య‌క‌ర్త‌గా ఆ పార్టీకి సేవ‌లందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని నిలబెట్టింది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement