Friday, November 22, 2024

NLG: మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పై 9 న అవిశ్వాసం…విప్ జారీ చేసిన బి ఆర్ ఎస్…

మోత్కూర్, ఫిబ్రవరి 2 (ప్రభ న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేగారెడ్డి పై జనవరి 20న బిఆర్ఎస్, కాంగ్రెస్ కి చెందిన 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ తీర్మానం కాపీని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే కు స్వయంగా కలిసి అందజేశారు. అదే రోజు క్యాంపుకు వెళ్లిన 9 మంది కౌన్సిలర్లు ఇటీవల వరకు ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో క్యాంపులో ఉండగా…. తాజాగా గత 2,3 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లినట్లు తెలిసింది.

మరో వారం రోజుల్లో అవిశ్వాసం ఉండడంతో అప్పటివరకు విహారయాత్ర చేస్తూ ఫిబ్రవరి 8న హైదరాబాద్ కి చేరుకొని, 9న ఉదయం మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగే అవిశ్వాస కార్యక్రమానికి నేరుగా 9 మంది కౌన్సిలర్లు హాజరుకానున్నట్లు తెలిసింది. 20 రోజుల క్యాంప్….. జనవరి 20 న క్యాంప్ కి వెళ్లిన 9 మంది అసమ్మతి కౌన్సిలర్లు గత 14 రోజులుగా క్యాంప్ లోనే ఉండగా,మరో 6 రోజులు (9 న అవిశ్వాసం) వరకు మొత్తం 20 రోజులు క్యాంప్ లోనే ఉండనున్నారు. మోత్కూర్ లో రాజకీయ చరిత్రలో 20 రోజుల పాటు ఏ పదవులకు కూడా క్యాంప్ రాజకీయాలు నిర్వహించలేదని,ఇన్ని రోజులు ఆర్ధిక భారం భరించి క్యాంప్ నిర్వహించడంతో ఇక అవిశ్వాసం నెగ్గి చైర్మన్ సావిత్రి ని గద్దె దింపడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 7 గురు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ల కు విప్ జారీ…. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ బి ఆర్ ఎస్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పార్టీ సింబల్ పై గెలిచిన 7 గురు బి ఆర్ ఎస్ కౌన్సిలర్లకు (చైర్మన్ తో సహా) జనవరి 29,30 న విప్ జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement