ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. నేటి నుంచి 21 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 18న జిల్లా స్థాయిలో, 19న మండల స్థాయిలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహించనున్నారు. 28న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
జిల్లా ఓటర్లు 5,20,297 మంది..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాల్లో 426 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.. అందులో పురుషులు 2,59, 167 ఉండగా స్త్రీ లు 2,61,127 మంది, ఇతరులు 3గురు ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు 1,960 అధికంగా ఉన్నారు. అత్యధికంగా వలిగొండ మండలంలో 51,204 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా మోత్కూర్ లో 12,849 మంది ఓటర్లు ఉన్నారు.
అభ్యంతరాలను స్వీకరిస్తాం : కలెక్టర్ హనుమంతు కే జెండగే
గ్రామ పంచాయతీల వారీగా ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే శుక్రవారం తెలిపారు.రాష్ట్ర ఎన్ని కల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లో జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, ఓటరు ముసాయిదా జాబితాపై నేడు 14 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, 26న వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.ముసాయిదా ఓటర్ల జాబితాల సవరణపై ఈనెల 18 న జిల్లాస్థాయిలో, 19 న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని, 28న తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలాల వారీగా ఓటర్ల వివరాలు
-మండలం పేరు పురుషుడు స్త్రీ మొత్తం
-అడ్డగూడూరు – 11168 – 11484 – 22652
-అలేరు – 10259 – 10701 – 20961
-ఆత్మకూర్(ఎం) – 12629 – 12341 – 24970
-పోచంపల్లి – 13922 – 13895 – 27817
-భువనగిరి – 19229 – 19689 – 38918
-బీబీనగర్ 20813 – 21112 – 41925
-బొమ్మలరామారం – 14354 – 14536 – 28891
-చౌటుప్పల్ – 18658 – 18920 – 37579
-గుండాల – 12912 – 12582 – 25494
-మోటకొండూరు – 10275 – 10309 – 20584
-మోత్కూర్ – 6354 – 6495 – 12849
-నారాయణపూర్ – 19765 – 19569 – 39334
-రాజాపేట – 14607 – 14822 – 29429
-రామన్నపేట – 22401 – 22216 – 44617
-తుర్కపల్లి – 13108 – 13311 – 26419
-వలిగొండ – 25500 25704 51204
-యాదగిరిగుట్ట – 13213 – 13441 – 26654
-మొత్తం – 259167 – 261127 – 520297