రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మానాయక్ ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 77,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 4,72,708 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,17,580 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 586.90 అడుగుల నీటిమట్టం ఉన్నది. సాగర్ గరిష్ట నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ఇప్పుడు 304.9495 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement