ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణగిరి క్షేత్ర నిర్మాణం అద్భుతమని, తిరుమల తిరుపతి స్థాయిలో ఉందన్నారు.
ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావ్ ఘన స్వాగతం పలికి స్వామి వారి లడ్డూ, ప్రసాదాన్ని అందజేశారు. వీరితో పాటు కుందారపు కృష్ణ చారి, ఎర్రబోయిన రమేష్, రేగు బీరప్ప, బచ్చు శ్రీనివాసు, సైదులు, నవీన్, పాండు, రాము, ధనంజయ్, తదితరులు పాల్గొన్నారు.