Tuesday, November 19, 2024

Nalgonda – బిఆర్ఎస్ కార్యాల‌యాన్ని కూల్చేయండి … గులాబీ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు


కార్యాల‌య క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ పిటిష‌న్ కొట్టివేత‌
క‌ట్టిన త‌ర్వాత అనుమ‌తి ఏమిటి…
నేత‌ల‌ను త‌లంటిన హైకోర్టు
15 రోజుల‌లో ఆ భ‌వ‌నాన్ని కూల్చేయాల‌ని ఆదేశం
అలాగే రూ . ల‌క్ష రూపాయిలు జ‌రిమానా విధింపు

న‌ల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేసే అవ‌కాశం ఇవ్వాల‌ని , కూల్చ‌న‌ట్ల‌యితే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయాల‌ని ఆదేశించింది.

కాగా న‌ల్గొండ‌లో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది ఆ పార్టీ.. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి అని వ్యాఖ్య‌నించింది. నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని న్యాయమూర్తి పిటిషన్ దారులను ప్రశ్నించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీ లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందే పలుసార్లు ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలకు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లగా ఇప్పుడు అక్కడ కూడా కారు పార్టీకి చుక్కెదురైంది. దీంతో ఆ కార్యాల‌యం కూల్చివేత‌కు అధికారుల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement