ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి చేరుతుంది. అధికారులు సాగర్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 81,125 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 85,493 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.74 టీఎంసీలుగా కొనసాగుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement