Tuesday, November 26, 2024

నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వ‌ర‌ద‌ ఉధృతి..

నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజ్టెకు 3.22 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తివేసి 4.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్తాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.60 అడుగుల వద్ద ఉన్నది. సాగర్‌ గరిష్ఠ నీటి నిల్వ 312.04 టీఎంసీలు. ఇప్పుడు 298.98 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement