నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి పరిధిలోని పౌరసరఫరాల గోదాంలో కొద్ది నిమిషాల క్రితమే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు.. కాగా,. మొత్తం 25క రౌండ్లలో లెక్కింపు నిర్వహిస్తారు. ఒక్కో రౌండ్ లెక్కింపునకు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని సిబ్బంది అంచనా వేస్తోంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది. . సాయంత్రం నాలుగు గంటలకు అన్ని రౌండ్ల లెక్కింపు అధికారికంగా పూర్తికానుంది. కాగా.. సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,206 మంది ఓటర్లు ఉండగా1,89,782మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 41మంది అభ్యర్థులు పోటీపడగా, 346 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా.. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ తరఫున రవికుమార్ పోటీ చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది.