Friday, November 22, 2024

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ఎనిమిది క్రస్ట్ గేట్లు ఐదు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,19,016 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,14,081 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 309.9534 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement