Tuesday, November 26, 2024

Nagarjuna Sagar: భారీగా వరద.. 6 గేట్లు ఎత్తివేత

ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 6 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి 1,34,485 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులుగా ఉన్నది. సాగర్‌ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం 308.46 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ గట్లలోని విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement