Friday, November 22, 2024

NLG: మోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం…

మోత్కూర్, జూన్ 11 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ఇవాళ‌ ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉండ‌గా, జిల్లా సహకార అధికారి, ఎన్నికల అధికారి ఉద‌యం 11:30 వరకు కూడా రాకపోవడంతో నేరుగా క్యాంప్ నుండి వచ్చిన 9మంది డైరెక్టర్ లు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎన్నికల అధికారి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. మెజార్టీ సభ్యులు హాజరు కావడంతో చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గినట్లు భావించాలని డిమాండ్ చేశారు.

సింగిల్ విండో లో చైర్మన్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడు కాబట్టే…సదరు జిల్లా సహకార అధికారి.. చైర్మన్ అశోక్ రెడ్డి ప్రలోభాలకు లొంగి అవిశ్వాస ఓటింగ్ కి ఎన్నికల అధికారి హాజరు కాకపోవడం పట్ల తీవ్ర నిరసన తెలిపారు. సహకార ఉన్నతాధికారులు డి సి ఓ ను సస్పెండ్ చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామన్నపేట సి ఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి లు భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తుండగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ తో సహా డీసీఓ ఆలస్యంగా రావడంతో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. డీసీఓ లంచం తీసుకున్నాడoటూ… తక్షణమే ఆయ‌న‌ను సస్పెండ్ చేయాలని నిరసనలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement