యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియమితులయ్యారు. ఆయన తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు విప్ లుగా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ప్రభుత్వ విప్ లను అపాయింట్ చేశారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెల్లడించింది. ఆలేరురు మరోసారి విప్ కిరీటం దక్కింది. గతంలో 10ఏళ్లు విప్ గా సునీత పనిచేశారు.