Tuesday, November 19, 2024

కెసిఆర్ రెండు దశాబ్దాల ప్రస్థానం ప్రతినిత్యం సంచలనం! – మంత్రి జగదీష్‌ రెడ్డి

ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అంతరంగం
కేసీఆర్‌ దార్శనికుడు.. ఆయనతో కలిసి ప్రయాణం నా అదృష్టం
గులాబీ దళపతితో కలిసి నడిచిన క్షణాలు చాలు
ఈ పదవులు అన్నీ వాటిముందు చిన్నవే
అద్భుత నాయకత్వం.. ఆయనతో సరితూగే నాయకులు లేరు…
పేదల పెన్నిధి గులాబీ దళపతి

హైదరాబాద్‌, : ‘దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం టీఆరెస్‌ పార్టీ ఆవిర్భావం. చాలా సాదాసీదాగా ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ 20 ఏండ్లలో ఇన్ని సంచలనాలు సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎవరి అంచనాలకు అందకుండా ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాన్ని చేరుకున్న కేసీఆర్‌ నాయకత్వం ఒక అద్భుతం. దుర్భేద్యమైనది అనుకున్న సమైక్య పాలనను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన తీరు అనితర సాధ్యమైనది. నిరాశ నిట్టూర్పుల నుండి తెలంగాణ స్వాప్నికుల భయ సందేహాలను పారదోలి భిన్న ధృవాలైన కుడి, ఎడమ, మధ్యేవాద ఆలొ చనలను, ఆలోచనా పరులను ఏకం చేసి ఉద్యమ లక్ష్యాన్ని తీరం దాటించిన గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్‌. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కుట్రలు, కుతం త్రాలు, వెన్నుపోట్లు- నిత్యకృత్యాలైనా పడి లేచిన కెరటం లాగా అన్ని ఆటు-పోట్లు తట్టు-కొని చివరికి నిరాహారదీక్షతో ప్రాణాన్ని పణంగా పెట్టి చావు అంచుల్లోకి వెళ్లి తెలంగాణ ఫలాన్ని తెచ్చిన వీరుడు కేసీఆర్‌’ అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది సందర్భంగా ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్యూలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, ఉద్యమ ఎత్తుపల్లాలు, రాష్ట్ర సాధన, అభివృద్ధి ప్రస్థానంలో కేసీఆర్‌తో తన అనుభవాలను వివరించారు. టీ-ఆర్‌ఎస్‌ ఆవిర్భా వానికి ముందు నుంచి కేసీఆర్‌ అడుగులో అడుగై నడుస్తున్న ముఖ్య సహచరుల్లో జగదీష్‌రెడ్డి ఒకరు.
ప్రశ్న: టీ-ఆర్‌ఎస్‌తో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షే నేను కేసీఆర్‌ గారిని కలవడానికి ప్రేరణ. జలదృశ్యంలో పార్టీ పెట్టక ముందు నుంచే కేసీఆర్‌గారితో ప్రయాణించే అవకాశం రావడం అదృష్టం. ఆయనతో కలిసి నడిచిన క్షణాలు చాలు ఈ జీవితానికి. ఆయన మాటల్లోని విషయం నేర్చుకుంటే చాలు. ఆయన మౌనం కూడా ఒక పాఠమే. కేసీఆర్‌ ఒక అద్భుతం. ఆయన ఎవరికీ అర్థం కారు. ఇక్కడి విపక్షాలకు అసలే అర్థంకారు. ఆయన ఏంటో ప్రజలకు తెలుసు. ప్రజలేంటో కేసీఆర్‌కు తెలుసు. అలాంటి అపురూప నాయకుడితో వేల గంటలు చర్చల్లో కూర్చోవడం, ఆలోచనా పరిధిని విస్తరించుకోవడం, ఉద్యమంలోనూ, అభివృద్ధి యజ్ఞంలోనూ రెండు దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తుండడం ఎంతో తృప్తినిస్తుంది.
ప్ర: సీఎం కేసీఆర్‌తో మీకున్న అనుబంధం, మరిచిపోలేని సంఘటనలు?
మంత్రి: నేను ఇక్కడ ఈరోజు మంత్రిగా ఉన్నానంటే కారణం కేసీఆర్‌ గారు. కేసీఆర్‌ పరిచయం తర్వాతే నా ఆలోచనల్లో పరిణతివచ్చింది. దృక్పథం మారింది. అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్య మంలో కేసీఆర్‌ స్ఫూర్తితోనే పాల్గొన్నాం. ఆ రోజు చాలామంది తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేశారు. అప్పటికి వాళ్ళ పార్టీలలో అంతా ఆంధ్రా ఆధిపత్యం ఉండేది. తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది అని నమ్మి కొట్లాడారు. ప్రజలు నమ్మారు. ఇపుడు అది నిజమని నిరూపితమవుతోంది. యాభై, ఆరవైఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తెలంగాణ ఏర్పడిన ఆరేడేండ్లలోనే పరిష్కారమయ్యాయి. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి కృష్ణా-గోదావరి జలాల్లో వాటాజలాలను వినియోగంలోకి తీసుకురావడం, 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం, రైతు బంధు, రైతు బీమాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చడం, కల్యాణలక్ష్మి, ఆసరా ఫించన్లు ఈ పథకాలు పెట్టగలుగుతున్నమంటే కారణం తెలంగాణ నిధులు తెలంగాణ ఖర్చు చేయడమే. ఆ రోజు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ రావడం వల్ల సరిచేసుకున్నం. ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించగలవని కేసీఆర్‌ ద్వారానే అర్థం చేసుకున్నా.
ప్ర: కేసీఆర్‌ ఆలోచనావిధానం ఎలా ఉండేది?
మంత్రి: కేసీఆర్‌ ఉద్యమం ప్రారంభించిన రోజు నుండే తెలంగాణ ఎలా ఉండాలి, వచ్చిన తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచిం చేవారు. ఆయన ఒక్కొక్క అంశంపై చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. తను అధ్యయనం చేసినదానిని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేవారు. ఉద్యమం ప్రారంభించిన నాటినుంచే దాని ఫలితం వచ్చాక ఏం చేయాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని కార్యాచరణ సిద్ధం చేసిన ఏ-కై-క నాయకుడు కేసీఆర్‌. రాష్ట్రంలో ఆదాయవనరులు తక్కువగా ఉన్న వర్గాలు ఎలా పురోగతి సాధిం చాలి, అంతరాలు సమాజంలో అంతరాలు ఎలా తగ్గించాలి వంటి అంశాలపై అప్పట్లోనే కేసీఆర్‌ ఆలోచించేవారు. పథకాలపై గంటలు గంటలు చర్చిం చేవారు. అసమానతలు రూపుమాపలేం కానీ సమాజం అంతరాలు తగ్గించే దిశగా ఎలా పయనించాలన్నదానిపై స్పష్టమైన దిశానిర్దేశం చేసేవారు. వన రులను ఎలా వాడాలో చెప్పేవారు. దళిత, గిరిజన, మైనారిటీ- వర్గాలకు ఏం చేయాలి అని ఆలోచించేవారు. రాష్ట్రం ఏర్పడితే ఏం జరు గుతుందో భయాం దోళనలు ఉన్న సమయంలో కేసీఆర్‌ తన ఆలోచ నలను ఆచరణలో పెట్టి సమా జాన్ని ఆశ్చర్య పరిచారు. ఆరు మాసాల్లోనే విద్యుత్‌ సమస్యతీర్చారు. మూ డేళ్ళలో 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించారు. వారికి అన్నింటిపై ముందు నుండీ రాష్ట్ర సమస్యల పట్ల అవగాహన, పరి ష్కారంపై స్పష్టత ఉంది. అందుకే విద్యుత్‌ సమస్య పరి ష్కారమైంది. ఆరవైఏండ్లు ప్లnోరైడ్‌తో ఇబ్బందిపడ్డ నల్ల గొండలో ఇపుడు ఒక్క కేసు కూడా నమోదుకాలేదంటే మా నాయకుడు కేసీఆర్‌కు ఉన్న స్పష్టత. ఇలా ఉద్యమ సమ యంలో ఆయన చేసిన మథనం పాలనలో పరిష్కారంవేగంగా జరిగేందుకు పనికొచ్చింది. అపుడు ఎందుకు చర్చచేస్తున్నారని చాలామంది అనుకునేవారు. కానీ కేసీఆర్‌కు భవిష్యత్తు తెలుసు.. అది తర్వాత నిరూపితమైంది.
ప్ర: ఉద్యమ ప్రారంభంలో బాగా గుర్తుండిపోయే సంఘటనలు?
మంత్రి: తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనపుడు నిరాశానిస్పృహలు ఉండేవి. 2001 ప్రారంభంలో చర్చలు ప్రారంభించిన నాటినుండి ఇప్పటి వరకు వారు చెప్పిన ప్రతి అక్షరం నెరవేర్చారు. కేసీఆర్‌ గంటలు గంటలు తెలం గాణ వచ్చాక ఎలా ఉండాలని చెబుతున్న క్రమంలో- ‘ఇవన్నీ ఎట్లా సాధ్యం. తెలంగాణ రానిస్తరా’ అని ఇదంతా విన్న ఓ నాయకుడు ప్రశ్నించాడు. కేసీఆర్‌ గారు దానికి రెండున్నర గంటలు సోదాహరణంగా నా కళ్ళముందే వివ రించారు. అపుడు సార్‌ మీరు చెప్పింది వింటే సినిమా చూసినట్లు-గా ఉంది కానీ నిజంగా జరుగుతదా అన్నాడు. జరగడం కాదు.. మీరే పాత్రధారులైతరు. అధికారికంగా బుగ్గకారు పెట్టుకుని జై తెలంగాణ అని తిరుగుతరు అని 2001లో పార్టీ పెట్టిన కొత్తలోనే సమాధానమిచ్చిండ్రు.
ప్ర: కేసీఆర్‌ మీద విపక్షనేతలు చేస్తున్న విమర్శలు చూస్తే ఏమనిపిస్తోంది?
మంత్రి: వాస్తవానికి తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్‌కు రావాల్సి నంత పేరు, ఆరాధన రాలేదనేదే నా భావన. తెలంగాణ సాధించిన నేతగా వచ్చిన పేరుకంటే ముఖ్యమంత్రి పేరు ఎక్కువ కాదు. కేసీఆర్‌ మీద ప్రతిపక్షం పోటీ -పెట్టడం పెద్ద తప్పు. ఒక చిన్నపని చేసినందుకే కొన్నిచోట్ల ఏకగ్రీవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిమీద విప క్షాలు పోటీ-చేయడమేంటి? ఆకాశంలో ఉంది అనుకున్నదాన్ని భూమిమీదకు తెచ్చి కళ్ళ ముందు ఇది నీ తెలంగాణ అని చెప్పారు. తెచ్చిన తెలంగాణలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువచేశారు. ప్రభుత్వం అన్నాక కొన్ని వైఫల్యాలు ఉంటాయి. కేసీఆర్‌ లాంటి నాయకుడిని విమర్శించేటపుడు వాడే పదజాలం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ వచ్చాక సీఎం పదవిచేపట్టడం కేసీఆర్‌కు ఇష్టంలేదు. ఆ సమయంలో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేకపోవడం, సమస్యలు పరిష్కారంపై స్పష్టమైన అవగాహన ఉండడంతో సమాజం నుండి వచ్చిన డిమాండ్‌ మేరకు కేసీఆర్‌ సీఎం బాధ్యత తీసుకున్నారు.
ప్ర:మిగిలిన పార్టీలతో పోల్చినపుడు టీఆర్‌ఎస్‌ ఎలా ప్రత్యేకమైనది?
మంత్రి: టీఆర్‌ఎస్‌ ఒక లక్ష్యం కోసం ఏర్పడింది. ఆ లక్ష్య సాధనకోసం కేసీఆర్‌ గారి నాయకత్వంలో భూమీ ఆకాశం ఏకం చేసింది. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను తెలంగాణ మార్గం పట్టించింది. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించింది. తెలంగాణకు నిజమైన స్వాతంత్యం సాధించిన పార్టీ టీఆర్‌ఎస్‌,మా నాయకుడు కేసీఆర్‌. తెలంగాణకు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన పార్టీ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌. టీ-ఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ఉన్న ఈ విలక్షణత మరో పార్టీలో చూపించండి. అన్ని పార్టీలూ తెలంగాణకు ఏదో ఒక సందర్భంలో ద్రోహం చేసినవే. తెలంగాణ విషయంలో మాటతప్పినవే. తెలంగాణ ప్రజలు గోసపడుతుంటే ప్రేక్షకపాత్ర పోషించినవే. ఒక్క టీ-ఆరెస్‌ మాత్రమే తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లలో వారికి అండగా నిలిచింది.
ప్ర: రెండు దశాబ్దాల ప్రయాణం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?
మంత్రి: చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్వాతంత్యోద్య్రమంలో పాల్గొనలేదనే బాధ చిన్నతనంలో ఉండేది. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ పిలుపుతో అది తీరింది. పార్టీ ఆవిర్భావ సభ్యుడిగా జలదృశ్యంలో సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి అంతిమంగాపార్టీ పుట్టిన లక్ష్యాన్ని కళ్ళారా చూడడం గొప్ప తృప్తినిపిస్తుంది. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రణబ్‌ ముఖర్జీగారు కేసీఆర్‌ని ఉద్దేశించి ‘చంద్రశేఖర్‌ నువ్వు అదృష్టవంతుడివి. చాలామంది ఉద్య మం ప్రారంభించిన వాళ్ళు విజయాన్ని చూడరు. ఇలా ప్రారంభించిన వారు విజయం సాధించడం చాలా అరుదు’ అని ప్రశసించిన సందర్భంలో కేసీఆర్‌ వెంట ఉండడం అదృష్టం. తెలంగాణ సాధించడమే కాకుండా జరిగే అభి వృద్ధిలో భాగస్వామిని కావడం ఇంకా ఎక్కువ సంతోషం కలిగిస్తుంది. కేసీఆర్‌ తో కలిసి ఉండడమే అన్నిటికి మించిన అదృష్టం. పదవులు ఇవన్నీ ఎక్కువ కాదు. వందలు, వేల గంటలు ఆయనతో ఉండడమే అదృష్టం. చాలామందికి కేసీఆర్‌ గురించి తెలియదు. అర్థంచేసుకోగలిగే స్థాయి ఉన్న నాయకులు కూడా తెలంగాణ విపక్షాల్లో లేరు.
ప్ర: ఇపుడు అమల్లో ఉన్న పథకాల్లో కేసీఆర్‌ అనుభవంలోంచి పుట్టినవి?
మంత్రి: ఆసరా పథకం అసలు మా ఎన్నికల హామీ కాదు. అది పేదల ఆకలి తీర్చేందుకు, వృద్ధులకు ఆసరాగా ఉండాలని పెట్టిన పథకం. కన్నతల్లి తండ్రు లకు తిండిపెట్టాలని ఉన్నా, పెట్టలేని దారిద్యంలో ఉన్న అనేకమందికి సాయం చేసేందుకు ప్రధానంగా ఆకలితీర్చేందుకు ఒక పథకం ఉండాలని కేసీఆర్‌ భా వించారు. అదే ఆసరా. ముందు వేయి, పదిహేనువందలు, తర్వాత 2వేలు, 3వేలు అయింది. అందుకే ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పారు. తె లంగాణ వచ్చాక ఒక్క మనిషి కూడా ఆకలితో పస్తులుండొద్దు అందుకే ఆసరా పింఛను ఇస్తామని చెప్పారు. కల్యాణలక్ష్మి కూడా అలాగేపుట్టింది. రైతుల ఆదా యం తగ్గి, బిడ్డల పెళ్ళికి చేసిన అప్పు తీర్చలేక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటన సీఎంను కలచివేసింది. రైతుల ఇబ్బందులు తీర్చే క్రమం లోనే కల్యాణలక్ష్మి పుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా- గోదావరిలో నీరు ఎక్కడ ఉంది, ఏ పాయింట్లో నీటిని ఆపగలం, తీసుకోగలం అని స్పష్ట మైన విజన్‌ ఉంది. చరిత్రలో అరుదైన సందర్భం.

ప్ర: కేసీఆర్‌ దీక్ష అన్నపుడు ఏమనిపించింది?
మంత్రి: ఆమరణదీక్ష అన్నపుడు అందరం భయపడ్డం. కేసీఆర్‌ ఒక్కరే ఇది రైట్‌ -టైం అని చెప్పి ధైర్యంగా ఉన్నారు. తప్పకుండా విశ్వాసం ఉంది. వచ్చి తీరుతది. ఎవరూ భయపడొద్దు అన్నారు. కరెక్ట్‌గా వారు చెప్పింది చెప్పినట్లు-గా జరిగింది. ఆయన ఎత్తుగడలు కూడా తొంభై శాతం సత్ఫలితాలను ఇచ్చా యి. ఒక్క 2008 ఉప ఎన్నికలు నిరాశపరిచాయి తప్ప మిగతా అన్ని ఎన్నికలు గొప్పగా విజయవంతం అయ్యాయి. తెలంగాణ సాధన దిశగా ఏ ఫలితాలను ఆశించిన ఆ ఎత్తుగడ వేసేవారో ఆ ఫలితాలను కేసీఆర్‌ సాధిం చేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement