Tuesday, November 26, 2024

టీఆర్ఎస్‌కు బీజేపీ షాక్.. సాగర్ అభ్యర్థిగా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి సన్నిహితుడు?

బీజేపీలోకి మంత్రి జగదీష్ ప్రధాన అనుచరుడు
సాగర్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి ?
ఇవాళ మధ్యాహ్నం కీలక ప్రకటన చేసే ఛాన్స్

నాగార్జున సాగ‌ర్ – సాగర్ ఉప ఎన్నిక వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభ్యర్థి విషయంలో పార్టీలు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అటు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు కావడంతో బీజేపీ కూడా అనూహ్య నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది బిజెపి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నియోజకవర్గంలో కీలక నేత, మంత్రి జగదీష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎంసీ కోటిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉపఎన్నిక టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డి.. నేడు హైదరాబాద్‌లో బీజేపీలో చేరనున్నట్టు స‌మాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కొంతకాలంగా కోటి రెడ్డి టచ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం కోటిరెడ్డి హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనాయకులతో కలిసి ప్రత్యక్ష్య కావడం టీఆర్ఎస్‌లో దుమారం రేపుతోంది. మరోవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్‌కు మంగళవారం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. రేపటితో ఆ గడువు కాస్త ముగియనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో వ్యుహాత్మకంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. దీంతో ఎంతమాత్రం ఆలస్యం చేసినా.. అటుఇటు కాకుండా మిగిలిపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోటిరెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో సోమవారం బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ కార్యాలయంలో చేరనున్నారు. అనంతరం 2 గంటలకు బీజేపీ సాగర్ అనంతరం 2 గంటలకు బీజేపీ సాగర్ అభ్యర్థిగా కోటిరెడ్డి పేరును అధికారికంగా బీజేపీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఎంసీ కోటిరెడ్డి బీజేపీ తరపున నామినేషన్ వేయనున్నారు. మరోవైపు అటు టీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్‌ను పోటీలోకి దించేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. ఇవాళ మధ్యాహ్నం భగత్ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోటిరెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చింది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారని, కోటిరెడ్డికి మరేదైనా ఆఫర్ ఇస్తారా.. అనేది వేచి చూడాలి. కేసీఆర్ బుజ్జగింపులకు కోటిరెడ్డి వెనక్కి తగ్గుతారా లేదా బీజేపీలో చేరిపోతారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మొత్తం మీద ఇవాళ ఈ ప్రశ్నలన్నింటికి జవాబు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement