Friday, November 22, 2024

సాగర్ ఉపఎన్నిక -హస్తానికి అగ్ని పరీక్ష

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారింది. అక్కడ విజయం కోసం ఆయా పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డు తున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది నాయ కుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల 17న పోలింగ్ జరగ నుండగా.. ప్రచారం మాత్రం 15వ తేదినే ముగుస్తుంది. పోలింగ్ తేదీకి ముందే రోజే పార్టీలకు కీలకంగా ఉండటంది. పోల్ మేనేజ్ మెంట్ పై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టిసారిస్తాయి. పోటీలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు తమ కులానికి చెందిన ఓట్లను తమ ఖాతాలోకి వేసుకుని, ఇతర వర్గాల ఓట్లను కూడా పట్టు సాధించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాగా తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ ముఖ్య నేత లతో పాటు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఆయా పార్టీల కేడర్ నుసాగర్‌లోనే మోహరించిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక వైపు ప్రచారం నిర్వహిస్తూనే.. మరో వైపు ఇతర పార్టీల్లోని అసమ్మతివాదులను చేర్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ కు సాగర్ ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారడంతో.. ఆపార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం ఎక్కువగానే శ్రమిస్తున్నారు. సాగర్ లో విజయం సాధించకుంటే పార్టీ భవిష్యత్ ఇబ్బంది కరంగా ఉంటుందని, అందుకు ఇక్కడ విజయం సాధిం చాలని, అందుకు ఆ పార్టీ నేతలు వ్యూహా త్మకంగానే వ్యవహా రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిజానారెడ్డి ఈ నియోజక వర్గానికి సుపరిచితులు కావడంతో..విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ లో జానారెడ్డి హయాం లోనే అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీ ఠలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్‌తో పాటు పలువురు నాయకులు నియోజకవర్గం లోనే ఉంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి గత నాలుగు రోజులకు నియోజక వర్గంలో రోడ్డు షోలు నిర్వహిస్తూ పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి హయాంలో జరిగిన అభివృద్దే తప్పా టీఆర్ఎస్ చేసింది ఏమి లేదని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం లో భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. సామాజిక అంశంతో బరిలోకి దిగిన ఎంఎస్పీ
మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కూడా ఆ పార్టీ అభ్యర్థి అడెపు నాగార్జున విజయం కోసం విస్తృతంగానే పర్యటిస్తున్నారు. గత మూడు నెలలుగా సాగర్ లోనే తిష్ట వేసిన మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ పోరాటంతో సాధించిన విజయాలు, ఆరోగ్య శ్రీ పథకం, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు అంశాలతో పాటు ప్రజలు అండగా ఉంటే భవిష్యత్ లో సాధించే అంశాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. గతంలో ఉన్న ఓటు బ్యాంక్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement