నాగార్జునసాగర్ – ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి గెలిచినా టిఆర్ ఎస్ లోనే చేరిపోతారని జ్యోస్యం చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…ఉపఎన్నికలో సందర్భంగా బీజేపీ అభ్యర్థి తరుపున త్రిపురారం మండలం, పెద్ద దేవులపల్లిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జానా రెడ్డి అవుట్ డేటెడ్ నాయకుడని, అందుకే బిజెపికి అవకాశం ఇవ్వాని కోరుతున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు… కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదని,. కాంగ్రెస్‌లో గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్‌లోకే వెళ్తారన్నారు. . కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా.. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా రెండూ ఒకటేనని, తెలంగాణలో కుటుంబ పెత్తనం సాగుతోందని అన్నారు.. ఒకటి ఓవైసీ కుటుంబమైతే.. మరొకటి కేసీఆర్ కుటుంబమని కిషన్ రెడ్డి వివరించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్‌కు, కేసీఆర్ కొడుకు, కూతురు, బంధువులకు మాత్రమే న్యాయం జరిగింది. సామాన్య మానవునికి అన్యాయం జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ది చెప్పాలని ఓటర్లను కోరారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని అంటూ అప్పు అభివృద్ధి కోసం చేయాలి కానీ.. కుటుంబం బాగు కోసం చేస్తున్నారని మండి పడ్డారు…ప్రధానిగా మోడీ అయిన తరువాత కరెంట్ కొరత, ఎరువుల కొరత లేదని గుర్తు చేశారు… రైతులకు, పొదుపు సంఘాలకు కేంద్రం నిధులు ఇస్తున్నదని, కరోనా నియంత్రణకు కేంద్రం ఉచితంగా కరోనా టీకా ఇస్తుందని అన్నారు… కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రాష్ట్రంలో కనుమరుగయ్యే పార్టీ’ అని అంటూ పేద కుటుంబానికి చెందిన సాగర్ బీజేపీ అభ్యర్థి రవికి ఓటేసి గెలిపించాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement