Friday, November 22, 2024

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి సేవలో కెసిఆర్..

యాదాద్రి – ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఒక రోజు ప‌ర్య‌ట‌న‌కు యాదాద్రికి చేరుకున్నారు.. ముందుగా ఆయ‌న యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆల‌యానికి విచ్చేసిన ముఖ్య‌మంత్రికి అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం రాక సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు. దేశానికే తలమానికంగా చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే స్తంభోద్భవుని దర్శనభాగ్యం భక్తులకు కలగనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. గతేడాది సెప్టెంబర్‌ 13న సీఎం ఆలయానికి వచ్చారు. మళ్లీ ఐదున్నర నెలల తర్వాత యాదాద్రికి రాగా.. ఈ పర్యటనలో స్వామి వారి పునః దర్శనాలపై సీఎం స్పష్టత ఇస్తారని భక్తులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రూ.1200 కోట్లతో పంచనారసింహ క్షేత్రం పునః నిర్మాణ పనులను 2016 అక్టోబర్‌ 11న ప్రారంభించారు. కృష్ణశిలతో నిర్మించిన ఆలయం ప్రస్తుతం పూర్తి కావచ్చింది. 4.33 ఎకరాల్లో అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులతో ఆలయం అలరాలుతోంది. కాగా నిర్మాణ ప‌నుల‌పై కెసిఆర్ స్థ‌ప‌తుల‌తో చ‌ర్చించారు…జ‌రుగుతున్న ఆల‌య ప‌నులు ప‌ట్ల కెసిఆర్ సంతృప్తి వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement