ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : ఆడబిడ్డలకు మేనమామలా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నాడని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలోని కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణ లక్ష్మి పథకంలో 64 మందికి చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు సొంత నిధులతో పోచంపల్లి పట్టుచీర, దోతి, టవల్ ఆడపడుచు లాంఛనంగా అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అన్ని పథకాల్లో చాలా ఇష్టమైన పథకం కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ అని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అడగ గానే సీఎం కేసీఆర్ రూ.45 కోట్లు మంజూరు చేసాడని, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పేదలకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవని, సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు మహాదేవపురంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.