పెన్ పహాడ్, సెప్టెంబర్ 15: అంగన్వాడీలు చేపట్టిన దేశవ్యాప్త నిరోధక సమ్మెలో భాగంగా ఐదో రోజు శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయం ఎదుట మోకాళ్ళపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకురాలు బొలిశెట్టి భాస్కరమ్మ మాట్లాడుతూ… అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 అందించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్ పెంచాలని, తమ నాయకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు మంజుల, జయమ్మ, జానీ బేగం, లలిత, మంగమ్మ, లక్ష్మమ్మ, నిర్మల, ఊర్మిళ, విజయ, సుజాత, నాగమణి, మణి, నాగలక్ష్మి, బుజమ్మ, జానకి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -