చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఒకేసారి 51 పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. పరిశ్రమలతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్, సెవజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యాలయం, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ (టిఫ్)ను ప్రారంభించారు. టాయ్స్ పార్కుకు శంఖుస్థాపన చేశారు.. రూ. 156 కోట్లతో 106 ఎకరాల స్థలంలో ఈ పార్క్‌ను నెలకొల్పుతున్నది. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ అందుబాటులోకి రానున్నది.
కాగా గతంలోనే 5 ఎకరాల స్థలంలో సుమారు రూ.41 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ కేంద్రాన్ని జనవరి 2021లో శంకుస్థాపన చేశారు. రెండు బ్లాక్‌ల ఈ సెంటర్ మొదటి బ్లాక్‌లో సమావేశ మందిరాలు, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఆడిటోరియం, ఐలా, టిఫ్ కార్యాలయాలు, రెస్టారెంట్లు, బ్యాంక్‌ల కోసం నిర్మించారు. పార్కులో ఉత్పత్తి చేసిన పరిశ్రమల వస్తువులను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ప్రస్తుతం రెండో బ్లాక్‌ను నిర్మించనున్నారు.