Tuesday, November 26, 2024

అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలి..

యాదాద్రి, ప్రభ‌న్యూస్ : రాజాపేట మండలంలోని కుర్రారం, జాల.పాముకుంట గ్రామలలోని సుమారు 90 ఎకారల భూమి ఆక్రమ రిజిస్టేషన్ జరిగాయని, వెంటనే రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రాజాపేట తహసీల్ధార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న దీక్ష రెండవ రోజు కొనసాగుతుంది. తమ భూములను తమకు దక్కే విధంగా,మా తాతా తండ్రులు మరణిస్తే వారి పేర్ల నుండి మాపేర్ల పై ఎలాంటి పౌతి మార్పిడిలు సాదాబై నామ ద్వారా 13 బీ సర్టిఫికెట్, అమెండ్మెంటు లేకుండా వారి పేరు మీద ఉన్న భూములు అక్రమాదారులు రిజిస్టేషన్ చేసుకున్నారని, భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. రైతుల పట్టే దారుల భూములను అన్యాక్రాంతం చేస్తూ హద్దులు పొంతనలేని సర్వేనెంబర్ లకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.

అక్రమ రిజిస్ట్రేషన్లను కలెక్టర్ ఆధ్వర్యంలో రద్దు చేసి తగిన న్యాయ విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పంతం రాంచంద్రారెడ్డి, అనుముల సుధాకర్ రెడ్డి, బాల్ద చంద్రయ్య, చిందం సాయిలు, జూకంటి సాయిలు,రావుల బిరయ్య,రఘుపతి బాలరాజు,జంగిటి ప్రభాకర్, రావుల నవీన్, బాల్ద సంపత్, పెంట సత్యనారాయణ, రావుల నగేష్, చిందం ప్రమిల, రావుల నవీన్, బాల్ద సంపత్, రావుల రాములు, కోడూరు సాయిలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement