దేవరకొండ, ఆగస్టు 24 (ఫ్రభ న్యూస్) : దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.30కోట్లు మంజూరు కావడం జరిగిందని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.30కోట్ల పనులను 15రోజుల్లో ప్రారంభించాలని ఆయన తెలిపారు. మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని అన్నారు. రాష్టంలోనే మొదటగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దేవరకొండ మున్సిపాలిటీలోనే అని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ పైపు లైన్ల వల్ల, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల పాడైన రోడ్ల మరమ్మతులకు రూ.50లక్షలు మంజూరు కావడం జరిగిందని ఆయన తెలిపారు.
దేవరకొండ మున్సిపాలిటీలో రూ.5కోట్లతో ఎస్టీపి-1 పనులు, రూ.5కోట్లతో ఖిల్లాలో పార్కు పనులు త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రూ.30కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరపతయ్య, పొన్నబోయిన సైదులు, ముడవత్ జయప్రకాష్ నారాయణ, మహమ్మద్ రైస్, తౌఫిక్ ఖాద్రీ, చిత్రం ప్రదీప్, పల్లెపు అశోక్, ఇలియస్, రాజియాసుల్తాన, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, గోసుల అనంతగిరి, అర్వపల్లి నర్సింహ, పొట్ట మధు, తిరపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో 22పల్లె దవాఖానలకు రూ.4.40కోట్లు మంజూరు..
దేవరకొండ నియోజకవర్గంలో 22 పల్లె దవాఖానలకు రూ.4.40కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేవరకొండ మండల పరిధిలో గొట్టిముక్కుల, తాటికోల్, మైనంపల్లి, ముదిగొండ, కొండబిమనపల్లి గ్రామాలకు, చందంపేట మండల పరిధిలో గాగిల్లాపురం, తెల్దెవరపల్లి గ్రామాలకు, నేరడుగొమ్ము మండల పరిధిలో తిమ్మాపురం గ్రామానికి, డిండి మండల పరిధిలో తవక్లాపూర్, వీరబోయినపల్లి, కందుకూరు, ఎర్రారం, బొగ్గులదొన, టీ.గౌరారం, వావిల్ కోల్ గ్రామాలకు, కొండమల్లేపల్లి మండల పరిధిలో చెన్నారం, గాజినగర్, పెండ్లిపాకుల, చింతకుంట్ల, కోల్ముంతల్ పహాడ్ గ్రామాలకు, పిఏపల్లి మండల పరిధిలో బాలాజీ నగర్ తండా, మాదాపూర్ పల్లె దవాఖానలకు ఒక్కొక దవాఖానకు రూ.20లక్షలు చొప్పున మంజూరు కావడం జరిగిందని ఆయన తెలిపారు. నూతనంగా మంజూరైన పల్లె దవాఖానలకు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య శాఖ మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.