Tuesday, November 26, 2024

TS | నల్గొండ అదనపు కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్.. బాధ్యతల స్వీకరణ

నల్లగొండ ప్రతినిధి, (ప్రభ న్యూస్): నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కలెక్టర్ల సాధారణ బదిలీలలో భాగంగా సూర్యా పేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ ను కొమరం భీం అసిఫా బాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ చేసింది.

కాగా ఆయనను ప్రభుత్వం తిరిగి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా శుక్రవారం బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఆయన శనివారం జిల్లా కలెక్టరేట్ లోని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement