చేనేతకు చేయూతనందించేది కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని, మిగతా ఎక్కడా లేదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు సైని భగత్ ఏర్పాటు చేసిన కళా పునర్వి చేనేత యూనిట్ ని కేటీఆర్ ప్రారంభించారు. చేనేతలను కాపాడడంతో పాటు నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భగత్ బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు
ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… చేనేతల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఒకవైపు ప్రధానమంత్రి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పాలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్క్ ని పునరుద్ధరించి ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
నేతన్న విగ్రహాన్ని అవిష్కరించిన మంత్రి కేటీఆర్
నేతన్న విగ్రహాన్ని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. ఇవాళ యాదాద్రి జిల్లా పోచంపల్లి పట్టణ కేంద్రంలోని నేతన్న విగ్రహన్ని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలతో కలసి అవిష్కరించారు. వీరి వెంట గాధరి కిషోర్, ప్రభాకర్ రెడ్డి, సైది రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎల్ రమణ, కంచర్ల రామకృష్ణా రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డిలు ఉన్నారు.